చేర్యాల, ఆగస్టు 26 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో( Mallanna temple) సోమవారం కృష్ణాష్టమి (Krishnashtami )వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పట్నం వేసి పూజలు నిర్వహించారు. ఆలయ ఒగ్గుపూజరులు శ్రీ కృష్ణుడు, రుక్మిణి, గొల్లభామల వేషధారణలతో ఆలయ సంప్ర దాయం మేరకు ఉట్టి కొట్టాడంతో పాటు భక్తులకు మల్లన్న చరిత్రను ఆటపాటలతో వినిపించారు. అనంతర ఆలయ ప్రాంగణంలో ఒగ్గుపూజారులు మొదటగా బియ్యంతో చిన్నపట్నంతో పాటు పంచరం గులతో పెద్దపెట్నం వేసి, బోనం సమర్పించి, మల్లన్న స్వామి వారి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.
కలాణోత్సవం తర్వాత ఆలయ అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలతో పట్నం దాటిన అనంతరం ఆలయ అధికారులు, ఒగ్గుపూజారులు, భక్తులు పట్నం దాటి మల్లన్నను దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బాలాజీ, ఏఈవో బుద్ది శ్రీనివాస్, మల్లన్న ఆలయ ప్రధానర్చకుడు మహాదేవుని మల్లికార్జున్, సూపరింటెండెంట్ శ్రీరాములు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సిద్ధయ్య తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Yadadri | రేపు యాదాద్రికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు
MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై రేపు విచారణ..!