హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): బీసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలని, అందుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
9వ షెడ్యూల్లో బిల్లులను చేర్చాలని కోరుతూ రాష్ట్ర క్యాబినెట్ తక్షణం తీర్మానించాలని, అన్నిపార్టీలతో కూడిన ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపి ప్రధాని మోదీని కలిసేలా చర్య తీసుకోవాలని, రాజ్యాంగ సవరణకు పార్లమెంటులో మద్దతు కూడగట్టేందుకు చొరవ చూపాలని కోరారు.