హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ (ఏఐవీఏ-ఐవా) అధ్యక్షుడిగా కృష్ణమనేని పాపారావు ఎన్నికయ్యారు. హోరాహోరిగా జరిగిన ఎన్నికకు హోరాహోరీగా జరిగిన పోటీలో సమీప ప్రత్యర్థి వీ భాస్కర్‌రావుపై 2,186 ఓట్ల భారీ మెజార్టీతో పాపారావు గెలుపొందారు. జనరల్ సెక్రటరీ మినహా పాపారావు ప్యానెల్ నుంచి అభ్యర్థులందరూ గెలుపొందారు. ఉపాధ్యక్షులుగా నీలగిరి దివాకర్ రావు, తాండ్ర శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షురాలిగా శ్రీలత గోనె, జనరల్ సెక్రటరీగా పూస్కురు శ్రీకాంత్‌రావు, కోశాధికారిగా చెప్యాల హరీశ్‌రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వడ్డేపల్లి దామోదరరావు, నడిపెల్లి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా బల్మూరి ఆనందరావు, కోట్ల నరేందర్ రావు, బల్మూరి జగన్మోహన్రావు, అల్లాడి రాజేందర్ రావు, ఉజ్జిని కిషన్‌రావు, గొనె శ్రీనివాస్‌రావు, దాదన్నగారి సందీప్‌కుమార్, గొట్టిముక్కల భాస్కర్‌రావు, గన్నమనేని కృష్ణప్రవీణ్రావు, చెన్నమనేని రామ్మోహన్రావు, ఎత్తపు మధుసూదన్ రావు, మణికొండ కేశవ్‌రావు, చీటినేని సంజీవ్‌రావు, పొల్సాని రవీందర్ రావు, కోదాటి మాధవరావు, మహిళా కార్యవర్గ సభ్యులుగా గోమతి బొంత, షర్మిల పడకంటి, చింతల ఉదయశ్రీ గెలుపొందారు. తనతో పాటు తన ప్యానెల్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి, ఆశీర్వదించిన వెలమ బంధువులందరికీ సేవచేసే భాగ్య కల్పించిన ప్రతి ఒక్కరికీ పాపారావు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఐవా అధ్యక్షుడిగా పాపారావు మూడేండ్ల పాటు కొనసాగుతారు.