హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు పెంపునకు రంగం సిద్ధమైంది. రూ. 100 పెంచాలని అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు సర్కారు ఆమోదిస్తే ఫీజులు పెరుగుతాయి. ప్రస్తుతం హ్యుమానిటీస్ కోర్సులకు రూ. 520, సైన్స్ కోర్సులకు రూ. 750 పరీక్ష ఫీజుగా తీసుకుంటున్నారు.
ఇంటర్ వార్షిక పరీక్షలను 2026 ఫిబ్రవరి చివరివారంలో నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 23 లేదా 25 నుంచి పరీక్షలు నిర్వహించాలని ఇంటర్‌బోర్డు యోచిస్తున్నది. రెండు రకాల షెడ్యూల్స్ సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వం ఆమోదం తెలుపగానే అధికారులు షెడ్యూల్ విడుదల చేస్తారు. ఫస్టియర్, సెకండియర్ కలిపి 9లక్షల విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.