హైదరాబాద్, డిసెంబర్15 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి : చట్టసభల్లో ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్ల సాధనకు అన్ని పార్టీలతో క లిసి దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య వెల్లడించారు. దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని మోదీ విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్‌యాదవ్ ఆధ్వర్యంలో ఢిల్లీ అంబేదర్ ఆడిటోరియంలో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. చట్టసభల్లో ఓబీసీలకు సైతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు.
హైదరాబాద్, డిసెంబర్15 (నమస్తే తెలంగాణ): దేశంలో రిజర్వేషన్లపై విధించిన 50% కోటా పరిమితి ఎత్తి వేయాల్సిందేనని పలువురు వక్తలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సం ఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో సోమవారం బీసీల మహాధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాలో అఖిలపక్ష పార్టీల, బీసీ సంఘాల నేతలు పాల్గొని మా ట్లాడారు. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలని, లేకుంటే సామాజిక తిరుగుబాటు తప్పదని తేల్చిచెప్పారు. బీసీలు ఎన్నో ఏండ్లుగా ఉద్యమిస్తున్నా బీజేపీ, కాంగ్రెస్ స్పందించకుండా అన్యాయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పర్యటించిన సమయంలో అఖిలపక్షంతో ఎందుకు ప్రధానిని కలువ లేదని వారు ప్రశ్నించారు.