హైదరాబాద్, మార్చి22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణాజలాల పంపిణీ విషయమై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ ఏప్రిల్ 8 నుంచి ఢిల్లీలో ప్రారంభంకానున్నది. ఏపీ పునర్విభజన చట్టం 2014 సెక్షన్-89 ప్రకారం కాకుండా 1956లోని సెక్షన్-3 ప్రకారం విచారణ జరిపి ఉమ్మడి ఏపీకి కృష్ణాజలాల్లో కేటాయించిన 1,005 టీఎంసీలతోపాటు, గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలను తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య పున:పంపిణీ చేయడంతోపాటు, ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం గత అక్టోబర్‌లో నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ట్రిబ్యునల్ విచారణ జరుపనున్నది.