హైదరాబాద్, మార్చి4 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదీ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) మెంబర్ అజయ్గుప్తా స్థానంలో ఆర్ఎన్ శంకువ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అజయ్ గుప్తాను చండీఘడ్ ఐబీవో సీఈగా నియమించింది.