KR Suresh Reddy | రాజ్యసభలో బీఆర్ఎస్ నేతగా కేతిరెడ్డి సురేష్‌రెడ్డిని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు శనివారం నియమించారు. మొన్నటి వరకు ఈ స్థానంలో కే కేశవరావు కొనసాగారు. ఇటీవల ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కేసీఆర్ సురేష్‌రెడ్డిని నియమించారు. కే సురేష్‌రెడ్డి 2020 ఏప్రిల్‌లో రాజ్యసభకు నియామకమయ్యారు. ఆయన పదవీకాలం 2026 ఏప్రిల్ వరకు ఉన్నది. ప్రస్తుతం రాజ్యసభలో బీఆర్ఎస్కు కేశవరావుతో కలిసి ఐదుగురు ఎంపీలున్నారు. మిగితా వారిలో ఎంపీల్లో బీ పార్థసారధిరెడ్డి, డీ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, సురేష్‌రెడ్డి, ఉన్నారు.