హైదరాబాద్ : భూపాలపల్లి జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటుకానున్నది. ఈ మేరకు ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తపల్లి గోరి మండలం ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఎనిమిది గ్రామాలతో కొత్త మండలాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. 241 గ్రామ పంచాయతీలున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాను కరీంనగర్లోని ప్రాంతాలు, పూర్వ వరంగల్లోని కొన్ని ప్రాంతాల నుంచి ఈ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ జిల్లాకు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కే జయశంకర్ పేరు పెట్టారు.