జగిత్యాల, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో అష్టకష్టాలు పడుతున్న రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం జగిత్యాలలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కోరుట్ల నియోజకవర్గ కేం ద్రం నుంచి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో రైతులు జగిత్యాల జిల్లా కేంద్రం వదరకు పాదయాత్రగా బయలుదేరనున్నారు.
దాదాపు 25 కిలోమీటర్ల పాటు పాదయాత్ర నిర్వహించనున్నారు. జగిత్యాల సమీపంలోని చల్గల్ గ్రామ సమీపంలో పాదయాత్రకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంఘీభా వం ప్రకటించనున్నారు. అనంతరం జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలో సమావేశం నిర్వహించి, కలెక్టరేట్‌కు వెళ్లి వినతిపత్రం ఇవ్వనున్నారు.