శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 01:35:29

ఆరేండ్లలోనే అద్భుతాలు సృష్టించాం

ఆరేండ్లలోనే అద్భుతాలు సృష్టించాం

  • ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల రూరల్‌: స్వరాష్ట్రం సాధించుకున్న ఆరేండ్లలోనే సీఎం కేసీఆర్‌ సర్కార్‌ అనేక అద్భుతాలు సృష్టించిందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.  బుధవారం జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంతతో కలిసి మంత్రి కొప్పుల మీడియాతో మాట్లాడారు. రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని గద్దెనెక్కిన నరేంద్ర మోదీ ప్రభు త్వం నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిందని విమర్శించారు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి ఆదుకున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. ఆరేండ్లలో సుమారు లక్ష ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 50 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామని వివరించారు.