రెండేండ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదు
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వేల కోట్లతో ధర్మపురి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
ధర్మపురి, ఫిబ్రవరి 7: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వేల కోట్లతో ధర్మపురి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ధర్మపురిలో గులాబీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు చేసిందేమీ లేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తొలి సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధే తప్ప, రెండేండ్లలో కాంగ్రెస్ సర్కార్ తట్టెడు మట్టిపోసిన ఆనవాళ్లు లేవని ఆరోపించారు.
ఈ మేరకు శనివారం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 50శాతం సర్పంచులను గెలుచుకొని సత్తా చాటడంతో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక.. బీఆర్ఎస్ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

