హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎన్నికల నిర్వహ ణ ఏకపక్షంగా సాగిందని, దౌర్జన్యాలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ కౌన్సిలర్లు దౌర్జన్యాలకు దిగారని ఆరోపించారు. రా ష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్ల దౌర్జన్యం, ఇబ్రహీంప ట్నం ఎన్నిక తదితర అంశాలపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
కాంగ్రెస్ నేతల అరాచకాలపై వి చారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర ఎ న్నికల సంఘానికి ఫిర్యాదు చేసినవారిలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, వీ శ్రీ నివాస్‌గౌడ్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. ఈ సం దర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీసులు, అధికారులను విచ్చలవిడిగా వాడుకుంటూ, ప్రజ్వాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. దాదాపు 35 మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చినప్పటికీ, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటేనే అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారని, లేదంటే వాయిదా వేస్తున్నారని దుయ్యబట్టారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు మెజారిటీ ఉన్నా, సోమవారం, మంగళవారం రెండు రోజులుగా ఎన్నికలను బలవంతంగా వాయిదా వేసి వెళ్లిపోవడం బాధాకరమని పేర్కొన్నారు. జనగామ, తొర్రూర్ వంటి అనేకచోట్ల కూడా ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. పోలీసులను అతిగా ఉపయోగిస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజలు తమ హక్కులను వినియోగించుకునే వి ధంగా ఎన్నికలు జరుగుతున్నట్టు ఎక్కడా కనిపించడం లేదని దు య్యబట్టారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని చెప్పారు. పాలకపక్షం దౌర్జన్యాలపై ఈసీకి ఫిర్యాదు చేసినా, ఎ లాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆ రోపించారు. ఎన్నికల కమిషన్ ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలే కా నీ, అధికార పార్టీకి తొత్తుగా పనిచేయకూడదని చెప్పారు.. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ : శ్రీనివాసగౌడ్
కాంగ్రెస్ నేతలు విచ్చలవిడిగా డబ్బు లు పంపిణీ చేశారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ అ రాచకాల గురించి ఎన్నికల సంఘం దృష్టి కి తీసుకొచ్చినా పట్టించుకోలేదని మండిపడ్డారు. మొత్తం 35 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడిందని, అయితే వాటిలో 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నికను వాయిదా వేశారని దుయ్యబట్టారు. చైర్మన్, మేయర్ల ఎన్నికలో తమకు అనుకూలంగా వచ్చేంతవరకు ఆ ఎన్నికలను వాయిదా వేస్తున్నారని విమర్శించారు. తొర్రూర్‌లో ఒక దగ్గర ఒక మహిళా కౌన్సిలర్ చేతిఎత్తితే, ఆమె చేతిని లాగివేశారని, మరోచోట గెలిచిన అభ్యర్థి ప్రమాణం చేసినా, హైకోర్టు ఆదేశాల పేరు చెప్పి, ఆ ప్రమాణం చెల్లదంటూ అధికారులు ఎన్నిక నిలిపివేశారని దుయ్యబట్టారు. ఇంత విచ్చలవిడితనం గతంలో ఎప్పుడూ, ఎక్కడా లేదని మండిపడ్డారు. ఈ ఘటనలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.