హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో c 420 హామీలతో అధికారంలోకి వచ్చి 420 రోజులు గడిచినప్పటికీ ఏ ఒక హామీని కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. అలవికాని హామీలను నమ్మి అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ 420 హామీలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రశ్నిస్తే ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ అరెస్టులు చేయిస్తున్నదని తెలిపారు. 420 హామీలను నెరవేర్చే వరకు ఎన్ని కేసులు పెట్టినా తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.