కరీంనగర్ కార్పొరేషన్, జనవరి 25 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర పార్టీల నాయకులు, ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, కోఆపరేటివ్ సొసైటీల నాయకులను అణచివేయాలని చూస్తున్నదని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పీఏసీఎస్‌లో ఉన్న నాయకులను పార్టీల వారీగా విభజించి వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని దుయ్యబట్టారు.
శనివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెడగపల్లి విండో చైర్మన్ రమణారావుతో కలిసి ఆయన మాట్లాడారు. ధర్మపురి నియోజకవర్గంలో 12 కోఆపరేటివ్ సొసైటీలు ఉండగా ఆరింటిలో అవినీతి జరిగిందం టూ స్థానిక ఎమ్మె ల్యే లక్ష్మణ్‌కుమార్ ఫిర్యాదు చేస్తే ఒకే రోజులో ప్రిన్సిపల్ సెక్రటరీ, రిజిస్ట్రార్‌కు లేఖ రాయ డం, డీసీవో రావ డం, వెంటనే విచారణ అధికారులను నియమించారని పేర్కొన్నారు. రికార్డులను సరిగా చూడకుండా డీసీవో షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పు పట్టడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.