హైదరాబాద్, జూన్ 28(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మహాన్యూస్ చానల్ దురుద్దేశపూర్వకంగా అసత్య వార్తలు ప్రసారం చేసిందని, ఆ చానల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిజం ముసుగులో వ్యక్తిగతంగా విషం చిమ్మడం దుర్మార్గమని మండిపడ్డారు.