హైదరాబాద్ : తెలంగాణకే తలమానికంగా నిలిచిన సింగరేణి ( Singareni)సంస్థ ఎంతో మందికి ఉపాధి కాల్పించింది. అలాంటి సింగరేణిని ఎందుకు వేళం వేశారో చెప్పాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar) డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్లో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ(BJP) రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సింగరేణిని ప్రైవేట్ పరం చేసేందుకు చర్యలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో సింగరేణి నడుస్తున్నప్పటికి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పలు సంస్కరణలు చేపట్టి లాభాల్లోకి తీసుకొచ్చారన్నారు.
ఒడిషా, తమిళనాడు, గుజరాత్లో ఉన్న బొగ్గు గనులను ఆయా రాష్ట్రాలక కేటాయించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారని ప్రశ్నించారు. నాడు కేసీఆర్ సింగరేణిని తెలంగాణకు ఇవ్వాలని కోరిన ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. అంతేకాదు నాడు పీసీసీ చీఫ్ ఉన్న రేవంత్ రెడ్డి బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. నేడు అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపి బొగ్గు గనుల వేలంలో పాల్గొనడం వారి ద్వంద వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
సింగరేణికిలో ప్రైవేట్ సంస్థలు వస్తే రిజర్వేషన్లు పోతాయి. పేదలు, దళితులు హక్కులు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి(Kishan reddy) గనుల శాఖ మంత్రి పదవి రావడంతో సింగరేణిని కాపాడుతారని తెలంగాణ ప్రజలు భావించారు. అందుకు భిన్నంగా మంత్రి ప్రవర్తించడం విచార కరమన్నారు. సింగరేణికి కాపాడుకునేందుకు పార్టీలకు అతీతంగా ఉద్యమించాలన్నారు.