తేలిపోతున్న కుట్రలు.. దారికొస్తున్న కుట్రదారులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కుట్రలు దూదిపింజల్లా తేలిపోతున్నాయి. చీకటి శత్రువుల కుతంత్రాలు ఒక్కొక్కటిగా పటాపంచలవుతున్నాయి. అక్కసుతో ఆయనపై వేసిన అభాండాలన్నీ పచ్చి అబద్ధాలని రూఢీ అవుతున్నాయి.
- సంచలనాల కోసం కేటీఆర్‌పై ఆరోపణలు.. ఇప్పుడు క్షమాపణ
- మొన్న ఈనాడు దినపత్రిక నేడు మాజీ మంత్రి సురేఖ
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కుట్రలు దూదిపింజల్లా తేలిపోతున్నాయి. చీకటి శత్రువుల కుతంత్రాలు ఒక్కొక్కటిగా పటాపంచలవుతున్నాయి. అక్కసుతో ఆయనపై వేసిన అభాండాలన్నీ పచ్చి అబద్ధాలని రూఢీ అవుతున్నాయి. చేసిన ఆరోపణలన్నీ కట్టుకథలని, రాజకీయ ప్రేరేపితమేనని, అధికార పెద్దల ప్రాపకం కోసమేనని నిరూపితమవుతున్నాయి. వెరసీ కుట్రదారులు మెట్టు దిగుతున్నారు. ఒక్కరొక్కరూ దారికొస్తున్నారు. కొంత ఆలస్యంగానైనా మేలుకొని తమ తప్పులు తెలుసుకుంటున్నారు.
లెంపలేసుకొని పశ్చాత్తాపం వ్యక్తంచేస్తున్నారు. మొన్న పిచ్చి రాతలతో అడుగడుగునా తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శించే ‘ఈనాడు’ చేసిన తప్పును తెలుసుకొని లెంపలేసుకున్నది. నాడు అధికార దర్పంతో విర్రవీగుతూ ప్రభుత్వ నేత ప్రాపకం కోసం కేటీఆర్‌పై నోటికొచ్చినట్టు ఆరోపణలు చేసిన మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పశ్చాత్తాపం వ్యక్తంచేస్తూ తాజాగా కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
సురేఖ విచారంపై రాజకీయ వర్గాల్లో చర్చ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మాజీ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతున్నది. ఈ క్షమాపణ వ్యవహారం అనేక ప్రశ్నలను తెరపైకి తీసుకొస్తున్నది. ఇష్టారీతిన మాట్లాడిన మాటలతో జరిగిన నష్టాన్ని మరో మాటతో సరిచేయగలుతారా? నాడు నోటికొచ్చినట్టు దూషించి ఒక్క చిన్న ట్వీట్‌తో సారీ చెప్తే సరిపోతుందా? వారి భార్యాపిల్లలు పడ్డ బాధ తీరి పోతుందా? రాజకీయ సంచలనాల కోసం.. పెద్దవారిని సంతృప్తి పరిచేందుకు వ్యక్తిగత దూషణలకు దిగడం ఎంతవరకు సమంజసం?
అనే చర్చ సాగుతున్నది. తప్పు తెలుసుకోవడం, లెంపలేసుకోవడం వెనుక ఏదో మతలబు ఉంటుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అయితే మరికొందరు మా త్రం ఇందుకు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. క్షమాపణలు చెప్పడం ద్వారా బాధితులకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందని, ఆలస్యంగానైనా మేల్కొని తప్పు ఒప్పుకోవడం మంచి పరిణామమేనని విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవహారం ఆహ్వానించదగిందేనని పేర్కొంటున్నారు. రాజకీయ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

