హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖకు ఆదివారం హైదరాబాద్‌లో ఆమె నివాసంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియాల్, ఇతర ఉన్నతాధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అడవులు, పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం మరింత పెంచేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని అధికారులకు కొండా సూచించారు. అంతకు ముందు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఇతర అధికారులు, పండితులు మంత్రి దంపతులను కలిసి ఆశీర్వదించారు. త్వరలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు.