Konda Surekha | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): సినీనటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖ వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు స్పష్టంచేసింది. కేసులో త్వరితగతిన విచారణ చేపట్టేందుకు తాము అంగీకరించినందున ఈ నెల 26న కొండా సురేఖ హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసులో సమన్లు జారీ చేసిన కోర్టు గురువారం చేప ట్టిన విచారణకు మంత్రి సురేఖ హాజరుకాలేదు. ప్రభుత్వ కార్యకలాపాల వల్ల సురేఖ హాజరుకాలేదని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం విచారణను ఈ నెల 26కు కోర్టు వాయిదా వేసింది.