హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పులుల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నదని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో స్టేట్ లెవల్ టైగర్ ప్రొటెక్షన్ అండ్ మానిటరింగ్ సెల్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవుల్లో పులులను రక్షించేందుకు ఈసెల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. దీని వల్ల పులులు, మనుషుల మధ్య సంఘర్షణ కూడా తగ్గించవచ్చని పేర్కొన్నారు. పులుల సంరక్షణ కోసం కేంద్రీకృత కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఇలాంటి టెక్నాలజీ ప్రస్తుతానికి కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు.