హిమాయత్‌నగర్, అక్టోబర్ 13: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి (84) కన్నుమూశా రు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదర్‌గూడలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఏపీలో ఏపీసీసీ ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్‌తో పాటు పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
జర్నలిజంపై మక్కువ ఉన్న లక్ష్మారెడ్డి 1980లో న్యూస్ సర్వీస్ సిండికేట్(ఎన్ఎస్ఎస్) మొ దలుపెట్టి మీడియా రంగానికి సేవ లందించారు. 1982లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గా గెలుపొందారు. లక్ష్మారెడ్డి మృతి పట్ల పలు రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టులు, ప్రముఖులు సంతాపం తెలిపారు.