హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంత్యుత్సవాలు శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్‌బాపూజీ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, పలువురు మాజీ మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొండా లక్ష్మణ్‌బాపూజీ 110వ జయంతి వేడుకలను బీసీ సంక్షేమశాఖ, ప్రజా సంఘాలు, కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రముఖులు పాల్గొని బాపూజీ చిత్రపటాలకు నివాళులర్పించారు.