హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని కోనసీమ నుంచి కొబ్బరి బోండాలను ప్రత్యేకంగా అయోధ్యకు పంపుతున్నారు. రాములోరి కల్యాణానికి ఉపయోగించే విధంగా కల్యాణ బోండాలను కోనసీమ ప్రాంతం నుంచి గురువారం అయోధ్యకు పంపిస్తున్నారు. శంకు, చక్ర నామాలతో రూపొందించిన కొబ్బరి బోండాలను రామమందిరం ప్రారంభోత్సవానికి మండపేటకు చెందిన మహాలక్ష్మి, రామారెడ్డి దంపతులు పంపారు.