కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): హక్కు ల కోసం పోరాడిన యోధుడు కుమ్రంభీం 82వ వర్ధంతికి జోడేఘాట్ ముస్తాబైంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్లో ఆదివారం వర్ధంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం 10.15గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా బయల్దేరి 11.15గంటలకు జోడేఘాట్ చేరుకుంటారు. కుమ్రంభీంకు నివాళులర్పిస్తారు. 1.30 గంటలకు బయల్దేరి 2.30గంటలకు హైదరాబాద్కు చేరుకుంటారని సమాచా రం. సభకు 10వేల మంది గిరిజనులు పాల్గొంటారని అంచనా.