Lagcherla | లగచర్ల ఫార్మా బాధితులు తమ న్యాయ పోరాటాన్ని ఉధృతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అరాచక కాండపై ఇప్పటికే రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన బాధితులు.. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వారు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ఆదివారం ఉదయం వారు ఢిల్లీ వెళ్లారు. సోమవారం నాడు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కలవనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్, పోలీసులపై ఫిర్యాదు చేయనున్నారు.
కొడంగల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పెద్ద అన్నదమ్ముల అరాచకాలను, ఆ రోజు పోలీసులు, వారితోపాటు వచ్చిన కొందరు ‘ప్రైవేట్ సైన్యం’ వికృతంగా ప్రవర్తించిన తీరును కండ్లకు కట్టినట్టు శనివారం నాడు లగచర్ల బాధితులు హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ముందు వివరించారు. పక్కమీద పడుకున్న వారిని అలాగే పెడరెక్కలు విరిచిపట్టి, కొట్టుకుంటూ వ్యాన్లలో పడేసిన దౌర్జన్యకాండను మీడియా ఎదుట బాధితులు కన్నీటిపర్యంతమవుతూ వివరించారు.
బ్రేకింగ్ న్యూస్
ఢిల్లీకి చేరుకున్న కొడంగల్ లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు
రేపు జాతీయ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవహక్కుల కమిషన్ ను కలిసి రేవంత్ ప్రభుత్వం, పొలీస్ లపై ఫిర్యాదు చేయనున్న లగచర్ల కుటుంబ సభ్యులు pic.twitter.com/4cs5nJRY36
— Telugu Scribe (@TeluguScribe) November 17, 2024