నయీంనగర్, నవంబర్ 28 : విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ను అందించడమే కేఎల్ విశ్వవిద్యాలయం లక్ష్యమని యూనివర్సిటీ డీన్, ఎంహెచ్ఎస్ ప్రోగ్రాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ ఎం. కిషోర్‌బాబు అన్నారు. ఇంటర్మీడియట్ ఉన్నత ఉద్యోగావకాశాల కోసం ‘నమస్తే తెలంగాణ’, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ సంయుక్తంగా ఏకశిల జూనియర్ కళాశాల విద్యార్థులకు ‘లక్ష్యం-2026’పై అవగాహన సదస్సును హనుమకొండలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏకశిల జూనియర్ కాలేజీ చైర్మన్ డాక్టర్ తిరుపతిరెడ్డి, ‘నమస్తే తెలంగాణ’ బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్ కుమా ర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శివకుమార్, డిప్యూటీ హెచ్‌వోడీ డాక్టర్ అంకారావు, కాలేజీ ప్రిన్సిపాల్ జితేందర్‌రెడ్డి, యాడ్స్ మేనేజర్ అప్పని సూరయ్య హాజరై ముందుగా సరస్వతి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం జాతీయ గీతం పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్‌బాబు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాప్తంగా ఉన్న పోటీతత్వానికి దీటుగా వారిని తీర్చిదిద్దడంతో పాటు ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ లాంటి దిగ్గజ యూనివర్సిటీలతో సమానంగా విద్యను అందించడమే లక్ష్యంగా కేఎల్ యూనివర్సిటీ ముందుకు పోతున్నదని అన్నారు.
యూనివర్సిటీ విద్యార్థులతో మూడు శాటిలైట్లను కేంద్ర ప్రభుత్వం అనుమతితో అధికారికంగా ఆవిష్కరించామని, అంతేకాకుండా అన్ని సదుపాయాలను అక్కడ ఉన్న కాలేజీ యాజమాన్యమే ఏర్పాట్లు చేస్తుందని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని అన్నారు. మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంగా ప్రతి సంవత్సరం రూ. 100 కోట్ల విలువైన స్కాలర్షిప్ ద్వారా ఫీజులో రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రఖ్యాత కంపెనీల్లో ప్లేస్మెంట్స్ను విద్యార్థులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. పారిశ్రామిక, పరిశోధనాత్మక శిక్షణ విద్యా ప్రణాళిక ప్లేస్‌మెంట్స్ అంశాల్లో విదేశీ యూనివర్సిటీలు, కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. పరిశోధనలకు అగ్రప్రాధాన్యం ఉందని అన్నారు. ఒక విద్యార్థి యూనివర్సిటీలో చేరుతున్న క్రమంలో క్యాంపస్‌లో లైఫ్‌ైస్టెల్ ఎలా ఉంది?, స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంది?, యూనివర్సిటీ ర్యాంకింగ్‌లను చూసి చేరినప్పుడే వారికి సరైన న్యాయం జరుగుతుందన్నారు. అనంతరం ఆల్ ఇండియా జేఈఈ అడ్వాన్స్‌లో 684 ర్యాంక్ సాధించిన ముచ్చ ఫణికీర్తన్రెడ్డి తోపాటు ఏకశిల కాలేజీలో టాప్ విద్యార్థులకు బహుమతులను అందజేసి అభినందించారు.

ఈ సదస్సుకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఫ్యూచర్లో ఎలా ముందుకు పోవాలి?, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి?, కుటుంబ పరిస్థితులు బాగోలే నప్పుడు ఏ విధంగా ఉండాలి?, అనుకున్న స్కోర్ రాకపోతే ఏ విధంగా ముం దుకు పోవాలో ఈ సదస్సులో నేర్చుకున్నా. ఇటువంటివి ఏర్పాటు చేయడం మాలాంటి వారికి ఎంతో అవసరం.
విద్యార్థులు ముఖ్యంగా మెయిన్స్‌పై దృష్టి పెట్టాలి. ఫోకర్స్ పెట్టి సాధించే విధంగా హార్డ్ వర్క్ చేసి ముందుకు పోవాలి. ఇంజినీరింగ్, నీట్ కాకుండా ఇంట్రెస్ట్ట్ ఉన్న వాటిపై దృష్టి పెట్టి వాటిలో ఎటువంటి లాభాలు ఉన్నాయనే విషయం తెలియజేయడానికే ఈ ప్రోగ్రాం. ప్రతి స్టూడెంట్ ఒక గోల్ పెట్టుకుని దానిని సాధించే విధంగా కృషి చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు నిలబడాలంటే సెల్ఫ్ డిసిప్లేన్‌తో ఉం డాలి. అప్పుడే విజయాలు సాధించే అవకాశం ఉంటుం ది. ఇంటర్మీడియట్ వయస్సు అంటే చాలా సమస్యలు వస్తాయి. అందులో మంచి ఏదో చెడు ఏదో గ్రహించి ముందుకు పోయినప్పుడే జీవితంలో ఎదుగుతారు. తల్లిదండ్రుల కష్టాలను గుర్తించి, కష్టంతో కాకుండా ఇష్ట పడి చదివి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవాలి.
కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఎలా అంటే వర్సిటీలో విద్యార్థులు పండించిన కూరగాయలను తమ ఉపాధ్యాయులకే అమ్ముతుంటారు. జాబ్ సాధించడం గొప్ప కాదు. దాన్ని కాపాడుకోవడం నేర్చుకోవాలి. ఇంటర్మీడియట్ వయస్సు ఎంతో ముఖ్యమైనది. మన ఆలోచనలు ఏవిధంగా పనిచేస్తాయో అదేవిధంగా మన జీవితం కూడా ఉంటుంది.
కేఎల్ యూనివర్సిటీలో అధునాతమైన ల్యాబ్స్ ఉన్నాయి. ఎవరైనా మొదట చూసుకోవాల్సింది ల్యాబ్స్‌ను. ఇక్కడ 40కుపైగా ల్యాబ్స్, 70 ఎకరాల్లో ఫామింగ్ చేస్తున్నాం. అంతేకాకుండా కొత్త మెడిసిన్స్ ఎలా తయారు చేయడమనేది కేఎల్ యూనివర్సిటీలో సాధ్యమవుతున్నది. ల్యాబ్‌లో ఎక్యుప్మెంట్స్, ఇంజక్షన్లు ఎలా తయారు చేయాలి అనేవి రిసెర్చ్ డెవలప్మెంట్ వంటి వి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
విద్యార్థులు చదువుకునే సమయంలో లక్ష్యాలు పెద్దగా పెట్టుకుని, ఆచరణ గొప్పగా ఉండి, మార్గం సరైంది అయితే విజయం వరిస్తుంది. లక్ష్యాలు పెద్దగా ఉంటే ‘నమస్తే తెలంగాణ, కేఎల్ యూనివర్సిటీ, ఏకశిల విద్యాసంస్థలు తోడ్పాటు అందిస్తాయి. అందుకనే లక్ష్యం-2026 కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఒకప్పుడు ఏదైనా కోర్సు చదవాలంటే చాలా మందిని అడిగి సరైన నిర్ణయం తీసుకునే వారం కానీ నేడు సోషల్‌మీడియా ఎక్కువైనందున అందులో వచ్చే సమాచారం కరెక్టా కాదా అంటూ విద్యార్థులు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి.
కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లోని అజీజ్‌నగర్, బాజిపల్లి బ్రాంచీల్లో బీటెక్ అడ్మిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా బీబీఏ, డిగ్రీ కోర్సుల కోసం కేఎల్ జీబీఎస్ కొండాపూర్‌లో కలవు. సమాచారం కోసం 9000070667 నంబర్లో సంప్రదించండి.
‘నమస్తే తెలంగాణ’ ఇటువంటి అవగాహన సదస్సులు పెట్టించడం చాలా సంతోషంగా ఉంది. ఇంటర్ అయిపోయాక ఏమి చేయాలో ఈ సదస్సుతో పూర్తిగా అర్థమైంది. ర్యాంక్ వస్తే ఏమి చేయాలి, రాకపోతే ఏ విధంగా ముందుకు పోవాలో తెలిసింది. లక్ష్యాలను ఏ విధంగా సాధించాలో ఈ సదస్సు ద్వారా నేర్చుకున్నాను. ఇటువంటివి ఇంటర్లో ఎంతో అవసరం.
విద్యార్థికి చదువుతో పాటు లక్ష్యం అనేది ఎంతో ముఖ్యం. అది లేని చదువు వృధా అవు తుంది. ఈ సదస్సు ద్వారా అదే నేర్చుకున్నాను. చదివే సమయంలో మన లక్ష్యం ఏంటనేది మొదట క్లారిటీ ఉండాలి, ఆ తర్వాతే ఏమి చదవాలి, చదివిన తర్వాత ఎలా ముందుకు పోవాలో పూర్తిగా అర్థమైంది. ప్లేస్‌మెంట్స్ ఏ విధంగా సాధించాలో ఈ సదస్సు ద్వారా తెలుసుకున్నాను.
కష్ట పడ్డ వారికి ర్యాంకులు రావాలని ఏమి లేదు. పరిస్థితులు బాగోలేకపోతే ర్యాంకులు రాని వారికి కేఎల్ యూనివర్సిటీ వంటివి ఉండడం ఎంతో బలం. అంతేకాకుండా వారు అనుకున్న లక్ష్యాలను ఈ యూనివర్సిటీతో సాధ్యపడుతుందని నమ్మకం ఉంది. ఇది అద్భుత అవకాశాలను అందిస్తుంది. విద్యార్థులు వినియోగించుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
‘కేఎల్ యూనివర్సిటీ, నమస్తే తెలంగాణ’ వారు ఏర్పాటు చేసిన సదస్సు ఎంతో బాగుంది. ఒక పత్రిక కేవలం వార్తలు రాయడమే కాకుండా ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఆలోచన చేసి ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేయడంతో చదివే సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా చదవాలో నేర్చుకున్నా.
– ఏ శ్రీకాంత్, ఎంపీసీ(ఫస్టియర్)