చిన్నశంకరంపేట, నవంబర్ 28 : సాఫ్ట్వేర్ ఉద్యోగం.. లక్షల్లో వేతనం.. అయినా గ్రామాభివృద్ధే ధ్యేయంగా సర్పంచ్ ఎన్నికల బరిలో దిగేందుకు తరలివచ్చాడు మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రానికి చెందిన ఎన్నారై కంజర్ల చంద్రశేఖర్.
చిన్నశంకర్‌పేట సర్పంచ్‌గా తనతాత శంకరప్ప 40 ఏండ్లపాటు పనిచేసి గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యులయ్యారని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గ్రామంలో ఏ నోట విన్నా శంకరప్ప చేసిన అభివృద్ధి గురించే చెప్పుకొంటున్నారని, అదే స్ఫూర్తితో తాను సైతం గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించాలనే ఉద్దేశంతో అమెరికా నుంచి తిరిగి వచ్చినట్టు చెప్తున్నాడు.

నార్లాపూర్-డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని గోకారం వద్ద నిర్మించనున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. లేకపోతే సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా వాసులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.