హైదరాబాద్ : ప్రగతి భవన్లో రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో కైటెక్స్ కంపెనీ ప్రతినిధులు సమావేశం అయ్యారు. కేరళకు చెందిన ప్రముఖ వస్ర్త వ్యాపార సంస్థ కైటెక్స్.. రాష్ర్టంలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఈ సందర్భంగా జౌళి రంగంలో పెట్టుబడుల యోచనపై మంత్రితో ఆ బృందం చర్చించింది. పారిశ్రామిక విధానాలు, జౌళి రంగంలో అవకాశాలను మంత్రి కేటీఆర్ వారికి వివరించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కైటెక్స్ గ్రూపు చైర్మన్, ఎండీ సాబ్ ఎం జాకబ్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, హ్యాండ్లూమ్స్, టైక్స్టైల్స్ కమిషనర్ శైలజా రామయ్యర్, టీఎస్ఐఐసీ లిమిటెడ్ ఎండీ నర్సింహారెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
Govt Whip Sri @balkasumantrs Industries Dept Prl Secy, Sri Jayesh Ranjan, Commissioner of Handlooms and Textiles, Smt Shailaja Ramaiyer, MD @TSIICLtd, Mr Narsimha Reddy and Sr Officials from Industries Dept also participated in the meeting. pic.twitter.com/yj10SMEPPQ
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 9, 2021