ధన్వాడ, సెప్టెంబర్ 19 : నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్‌లో దళితులకు కరెంట్ మోటర్లు పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం ఆమె కార్యక్రమంలో మాట్లాడుతుండగా, గ్రామస్థులు రాజేందర్, కృష్ణయ్య, బాలకృష్ణయ్య మాట్లాడుతూ.. ఇండ్లు, భూములు ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, పేదలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. రాజేందర్‌ను కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యే వారించి మొదటి దశలో 48, రెండో దశలో 28 ఇండ్లను అర్హులకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు.