హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): కులగణన సర్వే ఓ తప్పుల తడక అని బీఆర్ఎస్ నిరూపించిందని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ తెలిపారు. ప్రభుత్వం మెడలు వంచడంలో సఫలమైందని పేర్కొన్నారు. ‘కులగణన సర్వేలో మిగిలిన వారికి ఆన్లైన్లో నమోదు కాదు.. వారి ఇండ్లకు ఎన్యుమరేటర్లు వెళ్లి వివరాలు నమోదు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేవని, స్థానిక సంస్థల్లో కూడా ఉన్న రిజర్వేషన్లను తగ్గించే కుట్రకు కాంగ్రెస్ తెరలేపిందని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్లపై పార్లమెంటులో కేంద్రం చట్టం చేసేలా అఖిలపక్ష నాయకులను ఢిల్లీ తీసుకెళ్లాలని శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.