హైదరాబాద్ : కేవలం రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై (KTR)తప్పుడు కేసులు పెడుతున్నదని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె.కిశోర్ గౌడ్(Kishore Goud) ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేక పోవడంతో వారి ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలతో అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని కిశోర్ గౌడ్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డి దుర్మార్గాలను ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేంతవరకూ కేటీఆర్ నాయకత్వంలో నిరంతర పోరాటం చేస్తామన్నారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు.
కాగా, ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యహారంలో ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యతంర ఉత్తర్వులను ఉపసంహరిం చుకున్నది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. దీనిపై నందినగర్‌లోని తన నివాసంలో తన లీగల్ టీమ్‌లో చర్చిస్తున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులతో సమాలోచనలు చేపట్టారు.