హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. మే 10న హైదరాబాద్‌లో పర్యటన సందర్భంగా మోదీ రూ.7,823 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని వెల్లడించారు.
హైదరాబాద్‌లో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి టర్మినల్, మహబూబ్‌నగర్‌లో రూ.3,175 కోట్ల విలువైన నేషనల్ హైవే పనులను వర్చువల్‌గా ప్రారంభిస్తారని వివరించారు. హఫీజ్‌పేట, జోగుళాంబ రైల్వే స్టేషన్లు, కాజీపేట-విజయవాడ మధ్య మూడో రైల్వే లైన్ ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.85వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ తొలిసారి రాష్ర్టానికి వస్తున్నారని పేర్కొన్నారు.