Thousand Pillar Temple Kalyana Mandapam | భక్తులకు అందుబాటులోకి వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం
కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల దేవాలయ కల్యాణ మండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పునఃప్రారంభించారు.
హనుమకొండ: కాకతీయుల కాలం నాటి వేయిస్తంభాల దేవాలయ కల్యాణ మండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పునఃప్రారంభించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని పునఃనిర్మించిన కల్యాణ మండపాన్ని రాష్ట్ర మంత్రులతో కలిసి ఆరంభించారు. అనంతరం యాగశాలలో శాంతి హోమ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వేయి స్తంభాల గుడి కట్టేందుకు 72 ఏండ్ల పట్టిందన్నారు. మధ్యయుగంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలను ధ్వంసం చేశారని తెలిపారు. పునఃనిర్మాణం చేసిన కల్యాణమండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేశామన్నారు. దీనివల్లే సంపూర్ణమైన వేయి స్తంభాల దేవాలయం పూర్తయిందని వెల్లడించారు. కాకతీయుల శిల్ప కళా వైభవం అద్భుతమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు.

2005లో కేంద్ర పురావస్తుశాఖ కల్యాణ మండప పునర్నిర్మాణ మహాఘట్టానికి శ్రీకారం చుట్టింది. పునరుద్ధరణకు మొత్తం రూ.15 కోట్లు వెచ్చించి పనులు పూర్తిచేసిన విషయం తెలిసిందే.
ఓరుగల్లు నగరాన్ని కాకతీయులు పాలించిన కాలంలో ఒకటో రుద్రుడు కీ.శ.1163లో వేయి స్తంభాల ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1,400 మీటర్ల వైశాల్యంలో, శివుడు, కేశవుడు, సూర్యుడు ఒకే దగ్గర పూజలందుకునే విధంగా ఈ ఆలయాన్ని రూపొందించారు. శిలలపై సప్తస్వరాలు లిఖించడంతో పాటు టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లోనే టన్నుల కొద్దీ బరువుండే శిలలతో ఆలయానికి జీవం పోశారు. డంగు సున్నం, కరక్కాయపాడి, బెల్లం, ఇటుక పొడి తదితర మిశ్రమాలతో మొత్తం వెయ్యి స్తంభాలతో వెయ్యేళ్ల వరకు చెక్కుచెదరకుండా ఆలయాన్ని నిర్మించారు.
Live: Lord Shiva and Goddess Parvati Kalyanam and Darshan, Thousand Piller Temple, Hanamkonda, Warangal. https://t.co/CtG8cAQF2X
— G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) March 8, 2024
#WATCH | Telangana: Union Minister and Telangana BJP President G Kishan Reddy offer prayers at Thousand Pillar Temple in Hanumakonda, on the occasion of #Mahashivratri pic.twitter.com/aJYx0JKBcl
— ANI (@ANI) March 8, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

