హైదరాబాద్, జనవరి 12(నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వచ్చిందని, హోదా ఇవ్వడంలో పరిమితులు ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇ వ్వాలని కేంద్రాన్ని అడగటంలో తప్పు లేదని చెప్పారు.
ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరు మార్చారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని, అది సమస్య కాదని కొట్టిపారేశారు. వికసిత్ భా రత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్(గ్రామీణ్)-వీబీజీ రామ్జీ పథకంతో రాష్ర్టాలపై కాకుండా, కేంద్రం మీద కూడా అదనపు భారం పడుతుందని చెప్పారు.