గోల్నాక, అక్టోబర్ 2: మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని కేం ద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ గోల్నాక డివిజన్ అంబేద్కర్‌నగర్‌లోని మూసీ పరీవాహక నివాసితులను కలిసి ఆయన మాట్లాడారు.
పేదల ఇండ్లు కూల్చే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదని, పేదల ఇండ్లపైకి బుల్డోజర్ వస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేదల జోలికొచ్చి ఇండ్లు కూల్చుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పారు.