హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ) : జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూ) వైస్‌చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ తడిసిన కిషన్‌కుమార్‌రెడ్డి(టీకేకేరెడ్డి) నియమితులయ్యారు. ప్రభుత్వం జీవో జారీచేసింది. ప్రభుత్వ ఉత్తర్వులందుకున్న ఆయన మంగళవారమే జేఎన్టీయూకు చేరుకుని ఇన్చార్జి వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. మూడేండ్లపాటు ఆయన వీసీగా కొనసాగుతారు. వాస్తవానికి నిరుడు మే 21న వీసీ పోస్టు ఖాళీ అయ్యింది. తొలుత బుర్రా వెకంటేశంకు ఇన్చార్జి వీసీ బాధ్యతలప్పగించారు.
అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డికి ఇన్చార్జీ వీసీ బాధ్యతలప్పగించారు. మళ్లీ రెండోసారి సెర్చ్ సమావేశాన్ని నిర్వహించగా, సెర్చ్ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ టీకేకే రెడ్డిని నూతన వీసీగా నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. అయితే వీసీ ఎంపిక ప్రక్రియ గతంలోనే జరగగా, ఎన్నికల కోడ్ నేపథ్యంలో నియామకానికి అడ్డంకి ఎదురయ్యింది. దీంతో వీసీ నియామకం కాస్త అలస్యమయ్యింది. విశ్వవిద్యాలయ అభివృద్ధి, విద్యాప్రమాణాల పెంపునకు కృషిచేస్తా అని తడిసిన కిషన్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.