హైదరాబాద్, మార్చి 1(నమస్తే తెలంగాణ): దేశంలోనే అతిపెద్ద అగ్రి షోకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనున్నది. హైటెక్స్ వేదికగా ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శనలో సుమారు 150కి పైగా కంపెనీలు తమ వ్యవసాయ పరికరాలను ప్రదర్శనకు ఉంచనున్నాయి. సాగులో సాంకేతికను జోడించేందుకు అవసరమైన స్టార్టప్‌లను ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలో కొత్త వ్యవసాయ పరికరాలను, విధానాల గురించి రైతులు తెలుసుకునే అవకాశం ఉంటుంది.