హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్ఆర్ జిల్లా వేముల మండలం కొత్తపల్లిలో వీఆర్ఏ నరసింహ తన ఇంట్లో నిద్రిస్తుండగా బాబు అనే వ్యక్తి మంచం కింద డిటోనేటర్లుపెట్టి పేల్చాడు. ఈ ఘటనలో నరసింహ అకడికకడే మృతిచెందాడు. నరసింహ భార్య సుబ్బలక్ష్మమ్మకు గాయాలు కాగా, హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నరసింహ మృతికి వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): దుబాయిలో డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు టామ్కామ్ దరఖాస్తులు కోరుతున్నది. ఇండియన్ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్సు, 21-40 ఏండ్ల మధ్య వయసు వారు అర్హులను తెలిపింది. ఆసక్తిగల వారు tomcom. resume@ gmail.comకు రెజ్యూమ్ మెయిల్ చేయాలని సూచించింది.