మోత్కూరు, మార్చి 14: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి గురువారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక ఎస్బీఐ సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రాంతంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు కారులో వచ్చి చిన్నారులకు చాక్లెట్ల ఆశ చూపి ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. వారు ఓ చిన్నారికి చాక్లెట్ ఇస్తుండగా నిరాకరించిందని, బలవంతం చేసి ఇస్తుండగా ఎవరని ప్రశ్నించిన ఓ పెద్ద మనిషిని గమనించి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం పట్టణమంతా వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికులకు చెందిన మహీంద్ర కారుగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.