Khullam Khulla | ఓటుకు నోటే కాదు సీటుకు నోటట బేరం
రాజకీయ విపణిలోన ఎంత వింత నాటకం
ఎన్నికల సమరంలోన చూడు ‘హస్త‘లాఘవం
ఘోర చోర కళలోన నేర్పరులీ కురు సైన్యం
కొట్లాటలు కుమ్ముకోళ్లు కొత్త వీధి నాటకం
రచ్చ రచ్చ బాగోతం రాజీనామాల పర్వం
అసమ్మతి అసంతృప్తి అస్మదీయ బూటకం
అడ్డగోలు వ్యవహారం ‘చే‘జారిన సొంత జనం
…? దండమూడి శ్రీచరణ్