ఖానాపూర్ : కశ్మీర్‌లోని పహాల్గాంలో ( Pahalgaon ) హిందువులే లక్ష్యంగా పర్యటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ శనివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని ( Khanapur ) వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో దేశానికి అండగా నిలుస్తామని తెలిపారు. ముష్కరను పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.