ఖమ్మం, మార్చి 19: తెలంగాణ వచ్చిన తర్వాతే యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు పెరిగాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టంచేశారు. శనివారం ఖమ్మం నగరంలోని ఐటీ హబ్‌లో సోవార్జిన్ ఐటీ సొల్యూషన్స్ అనే సాఫ్ట్వేర్ సంస్థకు ఎంపికైన 21 మందికి నియామక పత్రాలు అందజేసి, మాట్లాడారు. ఐటీ హబ్ ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు సాంకేతిక రంగంలో ఉపాధి దొరికిందని చెప్పారు. ఐటీ హబ్ పరిధిలోని సంస్థలు మరికొంత మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సోవార్జిన్ ఐటీ సొల్యూషన్స్ ఎండీలు బత్తినేని నాగప్రసాదరావు, ప్రకాశ్, సీఈవో ప్రణీత్ పాల్గొన్నారు.