కారేపల్లి, డిసెంబర్ 21 : అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భల్లునగర్తండాకు చెందిన గుగులోతు నంద్యా (54) నిరుడు మిర్చి సాగుచేయగా తెగుళ్లు సోకి దిగుబడి రాలేదు. ఈ ఏడాది అధిక వర్షాలతో పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి.
దీంతో అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురైన నంద్యా శుక్రవారం పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.