సీఎం కేసీఆర్‌తోనే ఖమ్మం అభివృద్ధి : మంత్రులు

ఖమ్మం : ముఖ్యమంత్రి కేసీఆర్, యువనేత కేటీఆర్‌ల సహకారంతో ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలిగామని, అన్ని ఆటలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించేలా వివిధ అసోసియేషన్లు సహకారంతో కృషి చేస్తామని అన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, క్రీడల, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నూతనంగా నిర్మించిన మొదటి ఫోర్ భవనాన్ని, స్కేటింగ్ రింగ్‌ను, క్రికెట్ మైదానంలో టఫ్ వికెట్‌ను, అథ్లెటిక్ సాండ్ ట్రాక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఖమ్మం నుంచి అగ్గి పుట్టిందని మా నాయకుడు కేసీఆర్‌ను భుజానికి ఎత్తుకున్న ఉద్యమకారులు జిల్లాలో ఎంతో మంది ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా వంద స్టేడియాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 45 స్టేడియాలను పూర్తి చేశామని ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక స్టేడియం ఉండేలా రూపకల్పన చేస్తామన్నారు.
అనంతరం పర్యాటకుల కోసం ఖమ్మంలో రూ.10 కోట్లతో హరితప్లాజా హోటల్‌కు, బైపాస్‌రోడ్‌లోని ఎకరం స్థలంలో రూ.2 కోట్లతో బీసీ భవన్‌కు, లకారం ట్యాంక్‌బండ్‌పై తీగల వంతెనకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఈట్‌స్ట్రీట్, మ్యూజికల్ ఫౌంటెన్లను ప్రారంభించారు. అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన పంచాయతీ ఉద్యోగుల సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రంగుల హరివిల్లుగా మారిన ఎగ్జిబిషన్ గ్రౌండ్
ఎమ్మెల్సీ కవితను కలిసిన ఒగ్గు కళాకారులు
తాజావార్తలు
- అరుదైన సీతాకోక చిలుక
- యాదాద్రి పనుల్లో వేగం పెంచాలి
- పూదోటల కిసాన్!
- హింస.. వారి కుట్రే
- రైతులపై కేంద్ర ప్రభుత్వ దమనకాండను నిరసించాలి
- పక్కా ప్రణాళికతో పట్టణాభివృద్ధి
- ప్రగతి పథంలో నూతన మున్సిపాలిటీ
- టీఆర్ఎస్ యూత్ మడిపల్లి అధ్యక్షుడిగా ప్రకాశ్‌గౌడ్
- పండ్ల మార్కెట్లో బినామీల దందా
- రోదసి టికెట్.. 400 కోట్లు!