Danam Nagender | తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దురుసు ప్రవర్తన చూపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బూతులతో రెచ్చిపోయారు. నీ అమ్మ.. మిమ్మల్ని బయట తిరగనివ్వా అంటూ స్పీకర్ ముందే వార్నింగ్లు ఇచ్చారు. అయితే దానం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులతో పాటు ఇతర శాసనసభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దిగొచ్చి క్షమాపణలు చెప్పారు.
హైదరాబాద్ నగర అభివృద్ధి కార్యక్రమాలపై సభలో శుక్రవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చను ప్రారంభించిన దానం నాగేందర్.. బీఆర్ఎస్ సభ్యులను పరుష పదజాలంతో దూషించారు. ‘ హే మూసుకోవోయ్.. నీ అమ్మ.. బయటకూడా తిరగనియ్య కొడకా మిమ్మల్ని.. ఏమనుకుంటున్నారా మీరు నీ యమ్మ.. తోలుతీస్తా ఒక్కొక్కడిది.. అరేయ్’ స్పీకర్ ముందే బెదిరింపులకు దిగారు. దానం నాగేందర్ బూతులు మాట్లాడటంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ క్రమంలోనే మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కూడా దానం నాగేందర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నీ అమ్మ అని మాట్లాడటం కరెక్ట్ కాదని హితవు పలికారు. సభలో ఎవరూ నోరు జారవద్దు.. సహనంతో ఉండాలని సూచించారు. జనాలకు రాంగ్ మెసేజ్ వెళ్తుందని.. ఆ వ్యాఖ్యలపై దానం నాగేందర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో బూతులు మాట్లాడిన దానం నాగేందర్
నీ అమ్మ, తోలు తీస్తా, బయట తిరగనియ్య ఏమనుకుంటున్నారు రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపు pic.twitter.com/tdGpn6nOA2
— Telugu Scribe (@TeluguScribe) August 2, 2024
శాసన సభ్యుల నుంచి తీవ్రమైన స్పందన రావడంతో దానం నాగేందర్ దిగొచ్చారు. అమ్మ అనేది హైదరాబాద్లో తరచూ వాడుతుంటారని.. అది బూతు కాదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అయితే మళ్లీ స్పీకర్ జోక్యం చేసుకోవడంతో దానం నాగేందర్ క్షమాపణలు చెప్పారు. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నా అని అన్నారు.తానెప్పుడూ పరిధి దాటలేదని.. తన పనితీరు గురించి అందరికీ తెలుసని అన్నారు.
రికార్డులు పరిశీలించి తొలగిస్తాం..
దానం నాగేందర్ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా స్పందించారు. అసభ్య పదజాలం వాడివుంటే.. రికార్డులు పరిశీలించి తొలగిస్తామని స్పష్టం చేశారు. సభ్యులు తమ హక్కులను వినియోగించుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు.
నీ అమ్మ, మా అమ్మ అనేది బూతు కాదు సంస్కారవంతమైన భాష – దానం నాగేందర్ https://t.co/MxXhq9wHwI pic.twitter.com/pr02jwAUEj
— Telugu Scribe (@TeluguScribe) August 2, 2024