నాగర్కర్నూల్, డిసెంబర్ 26 : నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని కేజీబీవీలో(KGBV student) 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని భాను గురువారం స్వల్ప అస్వస్థతకు గురైంది. విషయం గమనించిన పాఠశాల నిర్వాహకులు బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి దవాఖానలో చికిత్స చేయించి ఇంటికి పంపించారు. విద్యార్థికి డైజేషన్ కాకపోవడంతో స్వల్ప అస్వస్థతకు గురైనట్లు తెలిపారు.
అయితే ఇంటికి వెళ్లాక కూడా మళ్లా అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు నాగర్కర్నూల్ దవాఖానకు తరలించి చికిత్స చేయించగా.. శ్వాస సంబంధ వ్యాధిగా వైద్యులు గుర్తించారు. కాగా, గురువారం ఉదయం అల్పాహారంలో బోండాలు తినడంలో ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు సోషల్ మీడియాతోపాటు, కొన్ని దినపత్రికల్లో వచ్చిన వార్తపై శుక్రవారం కలెక్టర్ సంతోష్ స్పందించారు. జిల్లా అధికారులను కేజీబీవీని సందర్శించి సమగ్ర నివేదికను తెప్పించి పరిశీలించారు.