గుడిహత్నూర్, ఏప్రిల్ 22 : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం తోషంకు చెందిన బోరెకర్ సౌజన్య(13) నేరడిగొండ మండలంలోని కేజీబీవీలో తొమ్మిదో తరగతి చదువుతున్నది. సౌజన్య కొన్ని రోజులుగా రక్తహీనతతో బాధపడుతున్నది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం వాంతు లు, విరేచనాలు కావడంతో ప్రిన్సిపాల్ రజిత కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు ఎవరూ రాకపోవడంతో అదేరోజు రాత్రి కేజీబీవీ సిబ్బంది జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది.