KTR | హైదరాబాద్ మే 17 (నమస్తేతెలంగాణ): బ్రిటన్లో ఈ నెల 30న జరిగే ‘ఇండియా వీక్-2025’ సదస్సులో ప్రపంచంలో భారతదేశ గొప్పతనాన్ని చాటిచెప్పే సదవకాశం తనకు దక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఆ సదస్సులో ప్రసం గించే అవకాశం తనకు దక్కిందని తెలిపారు.
తెలంగాణ ఎందుకు ముఖ్యమైనది.. అనే అంశంపైనా తన మనోగతాన్ని అక్కడి గొప్పవారితో పంచుకుంటానని పేర్కొన్నారు. అదేరోజూ ఐడియాస్ ఫర్ ఇండియా వార్విక్లో భాగంగా పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ను ప్రారంభించే అవకాశాన్ని ఆ సంస్థ తనకు ఇవ్వడం సంతోషకరమని అన్నారు. ఒకేరోజు రెండు కీలక కార్యక్రమాల్లో తాను పాల్గొనడం ఆనందంగా ఉన్నదని కేటీఆర్ తెలిపారు.