హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికెక్కడిదని హైకోర్టు ప్రశ్నించింది. ఆ అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పింది. ఈ మేరకు చట్ట నిబంధనలు ఉన్నాయని గుర్తుచేసింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ గైడ్‌లైన్స్‌కు వ్యతిరేకంగా చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది.
రిజిస్ట్రేషన్ చట్టం సెక్ష న్ 22ఏలో పేరొన్న పరిధిలోని అంశాల్లోకి వస్తే తప్ప ప్రభుత్వం ప్రైవే ట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడానికి వీల్లేదని చెప్పింది. ఇదే అంశంపై వింజమూరి రాజగోపాలాచారి వర్సెస్ రెవెన్యూశాఖ ము ఖ్యకార్యదర్శి కేసులో హైకోర్టు ఫుల్‌బెంచ్ తీ ర్పు చెప్పిందని గుర్తుచేసింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని 22ఎ(1)లోని ఏ నుంచి డీ వరకు ఉన్న ఉప నిబంధనల ప్రకారం నిషేధిత జాబితా ఆస్తులను రిజిస్ట్రేషన్ అధికారులు తిరసరించవచ్చనని చెప్పిం ది.
మేడ్చల్ మలాజిగిరి జిల్లా బాచుపల్లిలో సర్వే నం 132/సీ/బీ/1/ 2లోని 1.26 ఎకరాల భూమి విక్రయించడం కోసం ధరణి వెబ్పోర్టర్లో స్లాట్ బుకింగ్‌కు ఆసారం లేకపోవడంతో ఎస్ వెంకటసుబ్బ య్య అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీ నిపై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి గురువారం విచారణ జరిపారు. ఈ భూమిని సాదా బైనామా కింద కొనుగోలుచేసి, 1992లో చట్టప్రకారం క్రమబద్ధీకరించుకున్నానని, పట్టా కూడా ఉం దని వెంకటసుబ్బయ్య తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజు, చలానా ఇతరత్రా కింద రూ 3035 లక్షలు చెల్లించానని, తీరా స్లాట్ బుకింగ్ కాలేదని చెప్పారు.
జుల్ఫికర్ అలీఖాన్ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా,ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) తన భూమిని రిజిస్ట్రేషన్ కాకుండా ఆదేశాలను జారీ చేశారని వివరించారు. వాదనల తర్వాత పిటిషనర్‌కు చెందిన పత్రాలను పరిశీలించి రిజిస్ట్రేషన్ చట్టం, స్టాంపుల చట్టం ప్రకారం ఆ పత్రాలు ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించింది. తీర్పు ఉత్తర్వులు అందుకున్న వారంలోగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది.